- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం బైకాట్.. కాంగ్రెస్ సహా 19 పార్టీల నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ మొదలైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాదని ప్రధాని నరేంద్ర మోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించానే నిర్ణయాన్ని విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నెల 28న కొత్త బిల్డింగ్‌ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుండగా ఈ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని విపక్షాలు నిర్ణయించాయి. ఈ మేరకు 19 పార్టీలు బుధవారం సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని స్వయంగా మోడీని ప్రారంభించాలనుకోవడం ఇది ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అని విపక్షాలు అభివర్ణించాయి. ఈ విషయంలో ప్రభుత్వం తీరు ప్రజాస్వామ్యాన్ని బెదిరించేలా ఉందని పేర్కొంటూ కాంగ్రెస్ సహా 19 పార్టీలు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి బైకాట్ చేస్తున్నట్లు ఉమ్మడి లేఖను విడుదల చేశాయి.
ఈ లేఖలో కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన (యూబీటీ), ఎస్పీ, సీపీఐ, జార్ఖండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విదుతలై చిరుతైగల్ కట్చి, రాష్ట్రీయ లోక్ దళ్, టీఎంసీ, జేడీయూ, ఎన్ సీపీ, సీపీఐ(ఎం), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీల పేరుతో ప్రకటన వెలువడింది. కాగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం విషయంలో మరోసారి విపక్షాలు ఏకతాటిపైకి రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలు చేస్తున్న ఐక్యత రాగం ఎంత వరకు కలిసికట్టుగా ఉంటుందో చూడాలి మరి.