బయట పేపర్‌ లీకులు, లోపల వాటర్‌ లీకులు.. కాంగ్రెస్ సెటైర్లు

by Ramesh N |
బయట పేపర్‌ లీకులు, లోపల వాటర్‌ లీకులు.. కాంగ్రెస్ సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ వర్షాల కారణంగా పార్లమెంట్ లాబీ‌లో కూడా వాటర్ లీక్ అయ్యింది. ఇటీవలే కొత్తగా పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. గత ఏడాదే దీన్ని ప్రారంభించారు. అప్పుడే రూఫ్‌ నుంచి వర్షం నీరు లీకవుతుండటంతో విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పార్లమెంట్‌ లాబీలో వాటర్‌ లీక్‌ అవుతున్న దృశ్యాలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మరోవైపు కాంగ్రెస్‌ ఎంపీ మాణికం ఠాగూర్‌ ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసి.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బయట పేపర్ లీక్.. లోపల వాటర్ లీక్ అంటూ సెటైర్లు వేశారు. పార్లమెంట్ లాబీలో నీట లీకేజీ జరిగిందని, ఏడాది క్రితం అందుబాటులోకి వచ్చిన కొత్త భవనంలోని సమస్యలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. దీనిపై పార్లమెంట్‌లో వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెటడతానని రాసుకోచ్చారు. మరోవైపు నెటిజన్లు సైతం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed