బెంగాల్‌లో పాక్ గూఢచారి అరెస్టు!

by Vinod kumar |
బెంగాల్‌లో పాక్ గూఢచారి అరెస్టు!
X

కోల్ కతా : పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం చేస్తున్న బీహార్ యువకుడిని పశ్చిమ బెంగాల్‌ పోలీసులు హౌరాలో అరెస్టు చేశారు. భారతదేశ భద్రతతో ముడిపడిన ఇన్ఫర్మేషన్‌ను అతడు పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. అతడి ఇంట్లో పోలీసులు సోదాలు చేసి పలు డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడి ఫోన్‌ను చెక్ చేసిన పోలీసులు.. ఫొటోలు, వీడియోలు, చాట్‌ల రూపంలో పాక్ నిఘా వర్గాలకు సమాచారాన్ని పంపాడని గుర్తించారు. సుదీర్ఘ విచారణ తర్వాత అతడిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ఆ వ్యక్తి గతంలో ఢిల్లీలో ఉండేవాడని, ఇటీవల కోల్‌కతాలోని ఒక కొరియర్ సర్వీస్‌లో ఉద్యోగంలో చేరాడని చెప్పారు. తమకు అందిన పక్కా సమాచారంతో అతడిపై నిఘా పెట్టడంతో.. పాక్‌తో ఉన్న లింకులు బయటపడ్డాయని తెలిపారు.

Advertisement

Next Story