'పీవోకేలోని టెర్రరిస్టులకు చైనా ఆయుధాలు'.. భారత నిఘా వర్గాల హెచ్చరికలు

by Vinod kumar |
పీవోకేలోని టెర్రరిస్టులకు చైనా ఆయుధాలు.. భారత నిఘా వర్గాల హెచ్చరికలు
X

శ్రీనగర్ : పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో ఉగ్రవాదుల కార్యకలాపాలపై భారత నిఘా సంస్థలు కీలక హెచ్చరికలు చేశాయి. పీవోకేలోని ఉగ్ర మూకలకు పాక్‌ ఇంటెలీజెన్స్ ఏజెన్సీ ఐఎస్‌ఐ అడ్వాన్స్డ్ చైనా ఆయుధాలను సప్లై చేస్తోందని తెలిపాయి. చైనీస్‌ డ్రోన్ల సాయంతో ఈ ఆయుధాలను పీవోకేకు చేరవేస్తున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు వివరాలతో జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

పిస్తోళ్లు, గ్రనేడ్లు, నైట్‌ విజన్‌ పరికరాలు తదితర ఆయుధాలను ఉగ్రవాదులకు ఐఎస్ఐ అందిస్తోందని ఆ కథనాల్లో ప్రస్తావించారు. ఇండియాలోకి చొరబడేందుకు రెడీ అవుతున్న టెర్రరిస్టులకు డిజిటల్‌ మ్యాప్‌ షీట్లు, నేవిగేషన్‌ సిస్టమ్స్‌ను అందిస్తోందని భారత నిఘా వర్గాలకు సమాచారం అందిందని తెలిపారు. పీవోకేలో ఉన్న ఉగ్రవాదుల రహస్య సంభాషణలను.. భారత ఇంటెలీజెన్స్ ఏజెన్సీలు ట్రాక్ చేయకుండా నిలువరించే ఎన్‌క్రిప్టెడ్‌ కమ్యూనికేషన్‌ పరికరాలను కూడా పీవోకేలోని టెర్రరిస్టులు వాడుతున్నారని వివరించారు.

Advertisement

Next Story