లులు మాల్‌లో పాకిస్తాన్ జెండా కలకలం.. బీజేపీ నేతకు షాక్

by Javid Pasha |
లులు మాల్‌లో పాకిస్తాన్ జెండా కలకలం.. బీజేపీ నేతకు షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని కొచ్చిలో ఉన్న లులు మాల్‌లో పాకిస్తాన్ జెండా కనిపించడం వివాదం రేపుతోంది. కానీ ఈ జెండా బెంగళూరులోని లులు మాల్‌లో కనిపించినట్లు కర్ణాటకకు చెందిన బీజేపీ లీడర్ శంకుతల సోషల్ మీడియాలో తప్పుగా పోస్ట్ పెట్టారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు జత చేస్తూ ట్వీట్ చేయగా.. ఇది వైరల్‌గా మారింది. దీంతో బెంగళూరులోని లులు యాజమాన్యం రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది. మాల్ మేనేజర్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది.

కానీ ఆ ఫొటో బెంగూళురులోని లులు మాల్‌ది కాదని, కొచ్చిలోది అని యాజమాన్యం తెలుసుకుంది. ఆ తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టి మేనేజర్‌ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంది. అయితే తప్పుగా పోస్ట్ పెట్టినందుకు బీజేపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుగా చిత్రీకరించినందుకు బీజేపీ నేతపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా ఇలా తప్పుగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అంతకుముందు ఉద్యోగం కోల్పోయిన మేనేజర్ అతిరా సంపియాతిరి లింక్డ్ ఇన్‌లో తన ఆవేదనను పంచుకున్నాడు. కొంతమంది తప్పుడు రాతల వల్ల తనను ఉద్యోగం నుంచి తీసివేశారని, అకారణంగా ఉద్యోగం పోయిందని వాపోయాడు. తనను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని కోరాడు. ఈ పోస్ట్ లులు యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో కంపెనీ స్పందించింది. అతడిని వెంటనే తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed