- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Donald Trump: ట్రంప్ కి అభినందనలు తెలిపిన పాక్ ప్రధాని
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘన విజయం సాధించారు. పాకిస్థాన్ (Pakistan) ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. అందులో ‘రెండోసారి అధ్యక్షుడిగా విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌నకు అభినందనలు. పాకిస్థాన్- అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి రాబోయే పాలకులతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను’ అని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. కాగా.. సోషల్ మీడియాలో పాక్ ప్రధాని చేసిన పోస్టుకు మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కమ్యూనిటీ నోట్స్’ను యాడ్ చేసింది. అందులో ప్రధాని షెహబాజ్ పాక్‌లో ‘ఎక్స్’ను నిషేధించిన విషయాన్ని గుర్తుచేసింది. దీంతో షెహబాజ్ షరీఫ్ పై నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది.
ప్రధానిపై ట్రోలింగ్
పాక్ ప్రధాని షెహబాజ్ వీపీఎన్‌ను ఉపయోగించి ఎక్స్‌ను యాక్సెస్ చేసినట్లు మైక్రో బ్లాకింగ్ సైట్ పేర్కొంది. ప్రస్తుతం పాక్‌లో ఎక్స్ పై నిషేధం కొనసాగుతోంది. ఇలాంటి టైంలో.. ప్రధానే ‘ఎక్స్’ను వినియోగించడంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్స్ పై నిషేధం ఉండగానే.. దేశ ప్రధానే దాన్ని వినియోగించడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే, ఈ ఏడాది ప్రారంభంలో జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా సోషల్ మీడియా ఎక్స్‌ను పాకిస్థాన్ నిషేధిస్తున్నట్లు ఆ దేశ సమాచార మంత్రి ప్రకటించారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు తమ దేశ వ్యతిరేక కార్యకలాపాలను వ్యాప్తి చేసేందుకు ఎక్స్ ని వాడుతున్నట్లు ఆరోపించారు.