ఇమ్రాన్ ఖాన్ బెయిల్ పొడిగింపు..

by Vinod kumar |
ఇమ్రాన్ ఖాన్ బెయిల్ పొడిగింపు..
X

లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బెయిల్‌ను ఇస్లామాబాద్ హై కోర్టు (ఐహెచ్‌సి) మే 31వ తేదీ వరకు పొడిగించింది. అప్పటి వరకు ఆయనను ఏ కేసులోనూ అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. 70 ఏళ్ల తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ చీఫ్‌పై దాఖలైన కేసుల గురించి సమాచారం ఇవ్వడానికి మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరడంతో ఇస్లామాబాద్ కోర్టు పై విధంగా తీర్పు చెప్పింది. ఇమ్రాన్ కోర్టుకు హాజరుకాలేదు. అయితే ఆయనపై దాఖలైన అన్ని కేసుల వివరాలను కోరుతూ పీటీఐ వేసిన పిటీషన్‌ను కోర్టు విచారించింది. పీటీఐ చీఫ్‌పై దేశ వ్యాప్తంగా 100కుపైగా కేసులు ఉన్నాయని ఆ పార్టీ పేర్కొంది. మరోవైపు పీటీఐ నాయకులు మలీకా బొఖారీ, అలీ ముహమ్మద్ ఖాన్‌లను విడుదల చేయాలని ఇస్లామాబాద్ హై కోర్టు బుధవారం ఆదేశించింది. వారి అరెస్టు చట్ట విరుద్ధమని పేర్కొంది.

అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో అరెస్టయిన ఇమ్రాన్‌కు ఇస్లామాబాద్ కోర్టు బెయిల్ ఇచ్చింది. మే 15వ తేదీ వరకు దేశంలో నమోదైన ఏ కేసులోనైనా పాక్ మాజీ ప్రధానిని అరెస్టు చేయవద్దని ఆదేశించిన సంగతి తెలిసిందే. అల్ ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసు విచారణ కోసం మే 9న ఇస్లామాబాద్ కోర్టుకు వచ్చిన ఇమ్రాన్‌ను నాయకీయంగా అరెస్టు చేశారు. అయితే అది చట్టవిరుద్ధమని.. చెల్లదని.. విడుదల చేయమని సుప్రీం కోర్టు పేర్కొన్న ఒకరోజు తర్వాత ఇస్లామాబాద్ కోర్టు ఇమ్రాన్ ఖాన్ అరెస్టును వ్యతిరేకించింది. మే 12న బెయిల్ లభించినప్పటికీ ఏదో ఒక కేసులో మళ్లీ తనను అరెస్టు చేస్తారేమో అన్న భయంతో పీటీఐ చీఫ్ కోర్టు ప్రాంగణంలోనే గంటల తరబడి ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed