- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఊహించిన దాని కంటే వేగంగా తగ్గుతున్న ఓజోన్-హానికర వాయువులు
దిశ, నేషనల్ బ్యూరో: గత కొంత కాలంగా ఓజోన్ పొరను రక్షించడానికి శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. గతంతో పోలిస్తే, వాతావరణంలో ఓజోన్ పొరకు హాని కలిగించే వాయువులు ఊహించిన దాని కంటే వేగంగా తగ్గుతున్నాయని తాజా అధ్యయనంలో తేలిందని శాస్త్రవేత్తలు మంగళవారం చెప్పారు. అలాగే, అంతర్జాతీయంగా చేస్తున్న ప్రయత్నాల్లో "అతి పెద్ద ప్రపంచ విజయం" అని అన్నారు. ఓజోన్ పొరలో రంధ్రాలకు కారణమయ్యే హైడ్రో క్లోరోఫ్లోరో కార్బన్లు (HCFCలు) వాతావరణంలో వేగంగా క్షీణిస్తున్నాయని అదే విధంగా ఇతర గ్రీన్‌హౌస్ వాయువులు తగ్గుతుండటం వలన గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గే అవకాశం ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు.
1987లో సంతకం చేసిన మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రధానంగా రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనింగ్, ఏరోసోల్ స్ప్రేలతో సహా వందలాది ఉత్పత్తుల తయారీలో ఒకప్పుడు విస్తృతంగా ఉపయోగించే హానికర వాయువుల ఉత్పత్తి, వాటి వినియోగంపై నియంత్రణను దశల వారీగా నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పుడు అది మంచి ఫలితాన్ని ఇస్తున్నట్లు బ్రిస్టల్ విశ్వవిద్యాలయం నేతృత్వంలో అధ్యయనం తెలిపింది.
ఓజోను పొర క్షీణతకు కారణమయ్యే క్లోరోఫ్లోరో కార్బన్ల (CFC) ఉత్పత్తి 2010 నుండి ప్రపంచవ్యాప్తంగా నిషేధించబడినప్పటికీ, హైడ్రో క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉత్పత్తి, వినియోగాన్ని దశలవారీగా నిలిపివేస్తున్నారు. మాంట్రియల్ ప్రోటోకాల్ నిబంధనలు కఠినంగా అమలు చేసినట్లయితే కాలుష్య కారకాలపై విధించిన నిషేధం కారణంగా రాబోయే రోజుల్లో HCFCలలో బాగా క్షీణత కనిపించి ఓజోన్ పొరకు పడినటువంటి రంధ్రం పూర్తిగా మూసుకుపోయి భూమి మీద ఉన్న ప్రాణులకు చాలా మేలు కలుగుతుందని యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీలో మేరీ క్యూరీ రీసెర్చ్ ఫెలో, ప్రముఖ రచయిత డాక్టర్. ల్యూక్ వెస్ట్రన్ అన్నారు.