- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓవర్ కాన్ఫిడెన్సే బీజేపీని దెబ్బతీసింది..యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్
దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్సే బీజేపీని దెబ్బతీసిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాధ్ అన్నారు. లక్నోలోని రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్శిటీలోని అంబేద్కర్ ఆడిటోరియంలో బీజేపీ రాష్ట్ర యూనిట్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాషాయ పార్టీకి ఓట్లు తగ్గడం వల్ల ప్రతిపక్షం మళ్లీ దూసుకుపోతుందని తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో యూపీలో ప్రతిపక్షాలపై నిరంతరం ఒత్తిడి పెంచామని, అందుకే 2014 నుంచి 2022 మధ్య కాలంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో భారీ విజయాలను సాధించామన్నారు.
అయితే అతి విశ్వాసమే తాజా ఎన్నికల్లో దెబ్బ తీసిందన్నారు. గతంలో ఓటమిని అంగీకరించిన ప్రతిపక్షాలు మళ్లీ ఆక్టివ్ అయ్యాయన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాలని సూచించారు. దీనిని ఉపయోగించుకుని ప్రతిపక్షాలు, విదేశీయులు కుట్రకు పాల్పడ్డారని, అందులో విజయం సాధించారన్నారు. అందులో జరిగే పుకార్లను వెంటనే తిప్పికొట్టాలని తెలిపారు. బీజేపీకి జాతీయ దృక్పదం ఉందని, దాని ఆధారంగానే నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ నేతలను కోరారు. కాగా, ఏడు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.