దేశంలో అవయవ మార్పిడి ప్రతి ఏటా పెరుగుతోంది.. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి

by Vinod kumar |
దేశంలో అవయవ మార్పిడి ప్రతి ఏటా పెరుగుతోంది.. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి
X

న్యూఢిల్లీ: దేశంలో అవయవ మార్పిడి ప్రతి ఏటా పెరుగుతుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్నారు. కరోనా మహమ్మారి తర్వాత గత ఏడాది దేశంలో 15,000 అవయవ మార్పిడిలు చోటు చేసుకున్నట్లు చెప్పారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 27 శాతం పెరిగిందని తెలిపారు. ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన 'నొట్టొ సైంటిఫిక్ డైలాగ్ 2023'లో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరోనాతో 2022లో అవయవ మార్పిడిలో వృద్ధి 27 శాతం పెరిగిందని, 15 వేల లక్ష్యాన్ని చేరుకున్నామని చెప్పారు. ఆరోగ్య కార్యదర్శి మూడు ప్రాధాన్యత ప్రాంతాలను నొక్కిచెప్పారు.

ప్రోగ్రామాటిక్ పునర్నిర్మాణం, కమ్యూనికేషన్ వ్యూహం, నిపుణుల నైపుణ్యం ఈ అవయవ మార్పిడిలో కీలకమని అన్నారు. ప్రాంతీయ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరిపాలన నిర్మాణాలతో మెరుగైన యంత్రాంగం సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆధునీకరణను ఆయన స్వాగతించారు. దేశంలో 600లకు పైగా మెడికల్ ఆసుపత్రులు, కాలేజీలు ఉన్నప్పటికీ ట్రాన్స్ ప్లాంటేషన్ కొన్నింటికే పరిమితమైందని, దీనిని విస్తృతం చేయాల్సిన అవసరముందని చెప్పారు.

Advertisement

Next Story