Breaking: ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఘర్షణ.. 100 మంది మృతి

by Rani Yarlagadda |
Breaking: ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఘర్షణ.. 100 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఫుట్ బాల్ మ్యాచ్ (Football Match) చూసేందుకు వచ్చిన అభిమానుల మధ్య జరిగిన ఘర్షణ.. 100 మందిని బలి తీసుకుంది. ఈ ఘోర విషాదం పశ్చిమాఫ్రికా దేశమైన గినియా (Guinea)లో చోటుచేసుకుంది. ఫుట్ బాల్ టోర్నమెంట్ (Football Tournament) లో రిఫరీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. రిఫరీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఓ జట్టు ఫ్యాన్స్ మైదానంలోకి దూసుకువెళ్లగా.. మరో జట్టు ఫ్యాన్స్ వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ చెలరేగి.. పరస్పర దాడులకు దారి తీసింది. కొందరు పోలీస్ స్టేషన్ కు నిప్పంటించారు. ఈ ఘర్షణల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోగా.. కొందరు తీవ్రంగా గాయపడ్డారు.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన జెరెకొరెలో టోర్నమెంట్ నిర్వహించారు. ఆదివారం జరిగిన మ్యాచ్ మధ్యలో రిఫరీ నిర్ణయం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వీధుల్లో ఎక్కడ చూసినా మృతదేహాలు కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు 100 మంది మరణించినట్లు ఓ వైద్యుడు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

Advertisement

Next Story