Delhi Businessman: దేశరాజధానిలో వ్యాపారిపై కాల్పులు

by Shamantha N |
Delhi Businessman: దేశరాజధానిలో వ్యాపారిపై కాల్పులు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) కాల్పుల ఘటన కలకలం రేపింది. ఢిల్లీలోని షాహదారా జిల్లాలోని ఫార్ష్ బజార్ ప్రాంతంలో ఇద్దరు జరిపిన కాల్పుల్లో వ్యాపారవేత్త ప్రాణాలు కోల్పోయాడు. శనివారం ఉదయం బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు సునీల్‌ జైన్‌ (52) అనే వ్యాపారిపై కాల్పులు జరిపారు. “సునీల్‌ జైన్‌ (52) అనే వ్యక్తి యమునా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ (Yamuna Sports Complex)లో మార్నింగ్‌ వాక్‌కు వెళ్లాడు (Morning Walk). వాకింగ్‌ పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడిపై ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపారు” అని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనలో సునీల్‌ జైన్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు దేశ రాజధానిలోని కృష్ణా నగర్‌ వాసిగా గుర్తించారు. అతనికి పాత్రల వ్యాపారం (utensils business) ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు షాహదారా డీసీపీ తెలిపారు. క్రైం టీం సంఘటనాస్థలిలో దర్యాప్తు కొనసాగిస్తుందని వెల్లడించారు.

ఆప్ ఆందోళన

శుక్రవారం రాత్రి ఢిల్లీలోని గోవింద్‌పురి ప్రాంతంలో కామన్ టాయిలెట్‌ 'ఫ్లష్' విషయంలో స్థానికుల మధ్య గొడవ జరిగింది. దీంతో, స్థానికులపై నిందితుడు బిఖమ్ సింగ్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఒకరు చనిపోగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ రెండు ఘటనలపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఢిల్లీ శాంతిభద్రతల పరిస్థితిని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించింది. ఇకపోతే, షాహదారా, గోవింద్‌పురి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal ) స్పందించారు. బీజేపీ పాలనలో నేరస్తులు నిర్భయంగా మారారని ఫైర్ అయ్యారు. కాల్పులు, కత్తిపోట్ల వార్తలు వస్తున్నాయని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed