ప్రతి భారతీయుడు మా ఓటరే.. మల్లికార్జున ఖర్గె

by S Gopi |
ప్రతి భారతీయుడు మా ఓటరే.. మల్లికార్జున ఖర్గె
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముగిసిన తర్వాత 'విభజన, అబద్దాలతో నిండిన మతపరమైన ప్రసంగాలు 'చేసిన ప్రధానమంత్రిగానే మోడీ ప్రజలకు గుర్తుంటారని ఖర్గె విమర్శించారు. ఇటీవల ప్రధాని మోడీ ఎన్డీఏ అభ్యర్థులకు రాసిన లేఖలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి రిజర్వేషన్లు కాంగ్రెస్ లాక్కుంటుందన్న వ్యాఖ్యలను ప్రస్తావించిన ఖర్గె.. 'ప్రతి భారతీయుడు మా ఓటుబ్యాంకే.. పేదలు, అట్టడుగున ఉన్నవారు, మహిళలు, యువత, కార్మిక వర్గం, దళితులు, ఆదీవాసీలు. అందరూ తమ ఓటర్లేనని' పేర్కొన్నారు. ద్వేషపూరిత ప్రసంగాలకు బదులు గత పదేళ్లలో తన ప్రభుత్వ పనితీరుపై ఓట్లు అడగాలని ప్రధాని మోడీకి రాసిన లేఖలో ఖర్గే కోరారు. ఎన్డీఏ అభ్యర్థులందరికీ మీరు రాసిన లేఖను చూశాను. లేఖలోని మీ స్వరం, అంశాన్ని బట్టి చాలా నిరాశ, నిస్పృహ కనిపించింది. ప్రధాని స్థాయికి సరితూగని భాష ఉపయోగించడం బాధాకరమని పేర్కొన్నారు. మీ ప్రసంగాల్లోని అబద్దాలు మీరు అనుకున్న స్థాయిలో ప్రభావం చూపడంలేదని, మీ అభ్యర్థుల ద్వారా వాటిని విస్తరించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. మీరు ఒక అబద్దాన్ని వెయ్యిసార్లు చెప్పినంత మాత్రాన అది నిజం కాదని ఖర్గె ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed