హిందువులమని సగర్వంగా చెప్పండి: ఆరెస్సెస్ చీఫ్

by Swamyn |
హిందువులమని సగర్వంగా చెప్పండి: ఆరెస్సెస్ చీఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ ప్రజల్లో మన గుర్తింపుపై అవగాహన కొరవడిందని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అయితే, ప్రజలు తమ గుర్తింపు హిందువు అని సగర్వంగా చెప్పాలంటూ పిలుపునిచ్చారు. నాగపూర్‌లో తాజాగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘పదే పదే ఎవరో వస్తారు. మన తప్పుల వల్ల వాళ్లకు మనం బానిసలుగా మారతాం. ఈ వ్యాధికి చికిత్స అవసరం. లేదంటే, ప్రతిసారీ బానిసలం అవుతూనే ఉంటాం. మన తప్పులను సరిదిద్దుకోవాలి’’ అని అన్నారు. ‘‘అవగాహనలేమి కారణంగా, మన దేశంలో మనం ఎవరిమి? మనవారు ఎవరు? మన గుర్తింపు ఏంటి? అనేదానిపై చాలా మందిలో స్పష్టత లేదు. ఏళ్లనాటి బానిసత్వం కారణంగా మనలో మానసిక అణచివేత ఉంది. అందుకే మనందరినీ ఏకం చేసే ఉమ్మడి సూత్రంతో మొత్తం సమాజాన్ని వ్యవస్థీకరించాలి. మనం మన గుర్తింపును స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రపంచానికి కూడా చెప్పాలి. మనం ఎవరో మనకు తెలిస్తే, మనవాళ్లు ఎవరో తెలుస్తుంది. తద్వారా మన గుర్తింపు హిందువు అని, మనం హిందువులం అని గర్వంగా చెప్పుకోవాలి’’ అని చెప్పారు.


Advertisement

Next Story

Most Viewed