మా కుటుంబం స్వాతంత్య పోరాటంలో భాగమైంది..జావేద్ అక్తర్

by vinod kumar |
మా కుటుంబం స్వాతంత్య పోరాటంలో భాగమైంది..జావేద్ అక్తర్
X

దిశ, నేషనల్ బ్యూరో: తనను దేశ ద్రోహి కొడుకుగా అభివర్ణించిన ఓ సోషల్ మీడియా పోస్టుపై ప్రముఖ స్క్రీన్ ప్లే రచయిత జావేద్ అక్తర్ స్పందించారు. మా కుటుంబం 1857 తిరుగుబాటు నుంచి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భాగమైందని గుర్తు చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిన ఉద్దేశిస్తూ..మీరు పూర్తిగా అజ్ఞానులా లేదా పూర్తి మూర్ఖులా అని నిర్ణయించడం కష్టం. నా కుటుంబం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంది. బహుశా మీ పూర్వీకులు దాదాల కాళ్లు నొక్కుతున్నప్పుడు మా కుటుంబీకులు జైలుకు వెళ్లి ఉంటారు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. కాగా, ‘నేను గర్వించదగిన భారతీయుడినని, చివరి శ్వాస వరకు అలాగే కొనసాగుతానని జో బైడెన్‌కు తనకు మంచి సంబంధం ఉందని, మా ఇద్దరికీ తదుపరి అమెరికా అధ్యక్షుడయ్యే అవకాశం ఉందని’ అంతకుముందు ఆయన పోస్ట్ చేయగా దీనిపై ట్రోల్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే జావేద్ స్పందించారు.

మహువా మొయిత్రాపై కేసు నమోదు

జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మపై సోషల్ మీడియా పోస్ట్ చేసినందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదైంది. రేఖా శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 79 ప్రకారం ఈ కేసు నమోదు చేశారు. అలాగే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సైతం రేఖా లేఖ రాశారు. మొయిత్రాపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story