Parliament Winter Session: మోడీ-అదానీ భాయ్ భాయ్.. పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన

by Ramesh N |   ( Updated:2024-12-06 14:10:13.0  )
Parliament Winter Session: మోడీ-అదానీ భాయ్ భాయ్.. పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: శీతాకాల పార్లమెంట్ (Parliament Winter Sessions) సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. సమావేశాలు ఇవాళ ప్రారంభం అయిన వెను వెంటనే వాయిదా పడింది. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన తెలియజేస్తున్నారు. మోడీ-అదానీ భాయ్.. భాయ్.. అంటూ మాస్కులు ధరించి విపక్షాలు నిరసన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, విపక్ష ఎంపీలు పాల్గొన్నారు. అదానీ వ్యవహారంపై ఈడీ, సీబీఐలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో మహాపరినిర్వాణ్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోడీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే అంబేడ్కర్‌ చిత్రపటానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, విపక్ష నేతలు మల్లిఖర్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇతరులు నివాళులు అర్పించారు.

Advertisement

Next Story