- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవినీతి విషయంలో ప్రతిపక్షాలు వెనకడుగు వేస్తున్నాయి: మోదీ
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల స్పందించేందుకు వెనకాడటం వల్లే దేశంలోని పోలరైజేషన్ ఏర్పడుతుందని మోదీ గురువారం తెలిపారు. దేశంలోని అవినీతిపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రతిపక్షాలు సరైన పద్ధతిలో స్పందించడం లేదని మోదీ అన్నారు. 'దేశాభివృద్ధికి ఉన్న అతిపెద్ద అడ్డంకు అవినీతి. అవినీతిపై అత్యంత కఠినంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని ఆగస్టు 15న ఎర్రకోటపై ఇచ్చిన ప్రసంగంలో పేర్కొన్నాను. అవినీతిపై తీసుకుంటున్న చర్యలు కఠిన తరం కావడంతో దేశంలోని రాజకీయాల్లో పోలరైజేషన్ మొదలైంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కాపాడేందుకకు దేశంలో కొన్ని గ్రూప్‌లు ఒకటిగా ఏర్పడుతున్నాయి' అని మోడీ పేర్కొన్నారు.
'దేశంలోని ప్రతి పౌరుడికి మౌలిక వసతులను కల్పించడమే కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద ప్రాధాన్యత. దేశంలోని మోడర్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడం కేంద్రం లక్ష్యం. దేశంలోని ప్రతి పేదవానికి పక్కా ఇల్లు అందించాలని ప్రభుత్వం సరికొత్త క్యాంపెయిన్ చేస్తోంది' అని మోదీ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా దేశంలో బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. అందుకు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న డబుల్ ఇంజన్ ప్రభుత్వమే ప్రధాన కారణమని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read : ఇదీ సంగతి: బీజేపీ విధానాలతో దేశం బాగుపడేనా?
Also Read : బాన్సువాడలో నిర్మలా సీతారామన్ కాన్వాయ్ అడ్డగింత