శరద్ పవార్ నివాసంలో విపక్షాల భేటీ.. రాహుల్ గాంధీకి జైలు శిక్షపై స్పందిస్తారా?

by GSrikanth |   ( Updated:2023-03-23 14:28:08.0  )
శరద్ పవార్ నివాసంలో విపక్షాల భేటీ.. రాహుల్ గాంధీకి జైలు శిక్షపై స్పందిస్తారా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో గురువారం ప్రతిపక్ష నేతలు సమావేశం అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్షాల ఐక్యతతో పాటు ఈవీఎంల సామర్థ్యంపై చర్చించనున్నట్లు సంబంధింత వర్గాలు తెలిపాయి. అయితే మోడీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే కేసులో ఇవాళ ఉదయం సూరత్ కోర్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని దోషిగా తేల్చుతూ రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేయడంపై ఈ సమావేశంలో చర్చకు వస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.

కోర్టు తీర్పుపై కాంగ్రెస్ భగ్గుమంటోంది. ఇది రాజకీయ ప్రేరేపిత దాడిగా అభివర్ణించింది. రాహుల్ గాంధీ గొంతు నొక్కే ప్రయత్నం అని దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఆందోళనలకు దిగిన నేపథ్యంలో శరద్ పవార్ నివాసంలో జరుగుతున్న భేటీలో ఈ అంశంపై చర్చకు వస్తుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. విపక్ష నేతలను కేంద్రం ఏదో రూపంలో టార్గెట్ చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్న వేళ రాహుల్ కు మద్దతుగా నిలిచే పార్టీలు ఎన్ని అనేది ఉత్కంఠ రేపుతోంది.

Advertisement

Next Story

Most Viewed