- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. స్పీకర్‌కు షాకివ్వడానికి సిద్ధమైన విపక్షాలు!
దిశ, డైనమిక్ బ్యూరో: రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. రాహుల్ గాంధీ వ్యవహారం, అదానీ అంశంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీరుపై విపక్షాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తమ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రాహుల్ పై అనర్హత వేటులో స్పీకర్ తొందరపడ్డారని విపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ ప్రతిపాదన కాంగ్రెస్ ఎంపీల సమావేశంలో ప్రస్తావనకు రాగా వెంటనే కార్యచరణలోకి దిగినట్లు తెలుస్తోంది. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానానికి 50 మంది సభ్యుల సంతకాలు అవసరం కావడంతో విపక్ష నేతల పార్టీలతో కాంగ్రెస్ మాట్లాడుతోందని తెలుస్తోంది. అంత అనుకున్నట్లే జరిగితే విపక్షాలన్ని ఉమ్మడిగా స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ ప్రతిపాదనపై సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి. 2018లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రతిపక్షాలు భంగపడ్డాయని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.