Operation Sarp Vinaash 2.0: ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్‌’కు సర్వం సిద్ధం.. ఏకంగా ప్రధాని మోడీ మానిటరింగ్

by Shiva |
Operation Sarp Vinaash 2.0: ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్‌’కు సర్వం సిద్ధం.. ఏకంగా ప్రధాని మోడీ మానిటరింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు నిత్యం అలజడి సృష్టిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గత ఆరు నెలల నుంచి బార్డర్‌లో విధులు నిర్వర్తిస్తున్న భారత భద్రతా దళాలపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. దేశంలోకి చొరబడి విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా టెర్రరిస్టులు సైనికుల ప్రాణాలను తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదలను సమూలంగా ఏరేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రధాని మోడీ సారథ్యంలో ఇండియన్ ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్‌ను శ్రీకారం చుట్టబోతోంది. హిట్‌లీస్ట్‌లో గుర్తించిన 55 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను అంతమొందించడమే లక్ష్యంగా ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0‌ను ప్రారంభించబోతోంది. అయితే ఈ ఆపరేషన్ ఏకంగా ప్రధాని కార్యాలయమే పర్యవేక్షింస్తుండటం విశేషం. మిషన్‌లో భాగంగా అందులో భాగస్వాములైన ఆర్మీ అధికారులు, ట్రూప్ నేరుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

Advertisement

Next Story