Cooker Explosion :పేలిన ప్రెషర్ కుక్కర్.. ఒకరి మృతి.. మరొకరికి గాయాలు

by Hajipasha |
Cooker Explosion :పేలిన ప్రెషర్ కుక్కర్.. ఒకరి మృతి.. మరొకరికి గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రెషర్ కుక్కర్ పేలిన ఘటనలో ఒక వ్యక్తి చనిపోగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని జేపీ నగర్ ఏరియాలో ఉన్న ఉడుపి ఉపహార రెస్టారెంట్‌ సమీపంలో బుధవారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తి, గాయపడిన వ్యక్తి ఇద్దరూ(సమీర్, మొహసిన్) ఉత్తరప్రదేశ్ వాస్తవ్యులే. గాయపడిన వ్యక్తికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. వీరిద్దరూ ఒక భవనంలోని టెర్రస్‌‌పై ఉన్న గదిలో అద్దెకు ఉంటున్నారు.

భోజనం వండుతుండగా అకస్మాత్తుగా కుక్కర్ పేలడంతో వారి గదిలోని సామాన్లన్నీ ఎగిరి వచ్చి పక్కనే ఉన్న రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదవశాత్తు కుక్కర్ పేలిందని, ఈ ఘటనకు ఉగ్రవాద చర్యలతో సంబంధమేం లేదని బెంగళూరు పోలీస్ కమిషనర్ బి.దయానంద స్పష్టం చేశారు. ఆ ఇద్దరు వ్యక్తులు బార్బర్ వర్క్ చేస్తుండే వారని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు చెందిన ఒక టీమ్ హుటాహుటిన బెంగళూరుకు చేరుకొని వివరాలను సేకరించింది. పేలుడుకు గల కారణాలు ఏమిటనే సమాచారాన్ని స్థానిక పోలీసుల నుంచి తీసుకుంది.

Advertisement

Next Story