అంబేద్కర్‌ను కాంగ్రెసే అవమానించింది.. మేమే గౌరవించాం : మోడీ

by Shamantha N |
అంబేద్కర్‌ను కాంగ్రెసే అవమానించింది.. మేమే గౌరవించాం : మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: అంబేద్కర్ ను కాంగ్రెస్ ఎప్పుడూ అవమానిస్తూనే ఉందని మండిపడ్డారు. తమ బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ ను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. గిరిజన సమాజం సహకారాన్ని కాంగ్రెస్ అస్సలు గుర్తించలేదని విమర్శించారు.

అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యారని గుర్తుచేశారు. తాను మూడోసారి ప్రధాని అయితే దేశం నాశనమైపోతుందని కాంగ్రెస్ చెబుతోందన్నారు. తమపార్టీపైన విమర్శలు చేస్తున్న కాంగ్రెస్.. దేశ అభివృద్ధి పయనాన్ని మాత్రం నిర్ణయించలేక పోయిందన్నారు.

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు ప్రధాని మోడీ. వెనుకబడిన తరగతుల ప్రజలకు అంబేద్కరే స్ఫూర్తి అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. జై భీమ్! ఏదైనా సాధించాలంటే సంపన్న కుటుంబంలో పుట్టాల్సిన అవసరం లేదని అంబేద్కర్ నిరూపించారని పోస్ట్ చేశారు. పేదకుటుంబాల్లో జన్మించిన ప్రజలు కూడా కలలు కంటారని.. వాటిని కష్టపడి నెరవేర్చుకోవచ్చని అన్నారు.

Advertisement

Next Story