Omar Abdullah : ఈనెల 16న కశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం

by Hajipasha |   ( Updated:2024-10-14 16:59:23.0  )
Omar Abdullah : ఈనెల 16న  కశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
X

దిశ, నేషనల్ బ్యూరో : జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా బుధవారం(ఈనెల 16న) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనకు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ నుంచి ఆహ్వాన లేఖ అందిందని ‘ఎక్స్’ వేదికగా ఒమర్ వెల్లడించారు.ఇటీవలి జరిగిన కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ - కాంగ్రెస్ పార్టీల కూటమి ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం తొంభై అసెంబ్లీ సీట్లకుగానూ ఈ కూటమి నలభై ఎనిమిది సీట్లను గెల్చుకుంది. మరో నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా మద్దతును ప్రకటించారు. దీంతో సంఖ్యాబలం మరింత పెరిగింది.

Advertisement

Next Story