Omar Abdullah : ‘నేషనల్ కాన్ఫరెన్స్’ శాసనసభా పక్ష నేతగా ఒమర్ అబ్దుల్లా

by Hajipasha |   ( Updated:2024-10-10 12:06:34.0  )
Omar Abdullah : ‘నేషనల్ కాన్ఫరెన్స్’ శాసనసభా పక్ష నేతగా ఒమర్ అబ్దుల్లా
X

దిశ, నేషనల్ బ్యూరో : నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ శాసనసభా పక్ష నేతగా మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతు ప్రకటించారు. శుక్రవారం రోజు కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలతో భేటీ అనంతరం ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనతో లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఒమర్ అబ్దుల్లా కలిసే అవకాశం ఉంది. తనను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నందుకు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

‘‘నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో మా పార్టీ ఎమ్మెల్యేల బలం 42కు పెరిగింది. మాకు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ లేఖను జారీ చేసిన వెంటనే రాజ్‌భవన్‌కు వెళ్లి లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలుస్తాను. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరుతాను’’ అని ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. ఇటీవలే జరిగిన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 సీట్లకుగానూ కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి 49 సీట్లను సాధించింది. బీజేపీ 29 సీట్లకు పరిమితమైంది.

Advertisement

Next Story