- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
OLA: కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ తింటూ పట్టుబడ్డ డెలివరీ బాయ్!
దిశ, డైనమిక్ బ్యూరో: కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ తింటూ ఓ ఫుడ్ డెలివరీ బాయ్ పట్టుబడ్డ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన ఓలాలో అమన్ జైస్వాల్ అనే వ్యక్తి ఫుడ్ ఆర్డర్ పెట్టారు. డెలివరీ బాయ్ ఫుడ్ ను తీసుకున్నాడని మెసేజ్ వచ్చాక అమన్ అతడికి కాల్ చేశాడు. అయితే డెలివరీ బాయ్ తనకు అధనంగా 10 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. దానికి కస్టమర్ ఆ ఫుడ్ డెలివరీ సంస్థకు ఫిర్యాదు చేసి ఆర్డర్ కోసం వేచి చూశాడు. మరో సారి అతడికి కాల్ చేయగా.. వస్తున్నానని చెప్పి 45 నిమిషాలు పాటు వేచి చూసేలా చేశాడు. సహనం కోల్పోయిన అమన్ యాప్ లో ఉన్న మ్యాప్ అడ్రస్ ద్వారా డెలివరీ బాయ్ ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు.
అతడు వెళ్లి చూసే సరికి ఫుడ్ డెలివరీ బాయ్ తను ఆర్డర్ పెట్టిన ఫుడ్ తింటూ కనిపించాడు. దీనిని వీడియో తీస్తూ.. ఈ కస్టమర్ నేను ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఎందుకు తింటున్నావ్ అని ప్రశ్నించాడు. దానికి డెలివరీ బాయ్ ఏం చేసుకుంటావో చేస్కొ అని తెగేసి చెప్పాడు. ఇవి నేను ఆర్డర్ పెట్టుకున్నానని చెప్పగా.. అయితే నేనేం చేయాలి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఈ చేదు అనుభవాన్ని ఆ కస్టమర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక డెలివరీ బాయ్స్ ను ఎంపిక విషయంలో కొన్ని నిబందనలు పాటించాలని సలహాలు ఇస్తున్నారు.