Odisha train accident : తల్లి మరణంతో 14 ఏళ్ల తర్వాత ఇంటికి.. అంతలోనే..

by Rajesh |
Odisha train accident : తల్లి మరణంతో 14 ఏళ్ల తర్వాత ఇంటికి.. అంతలోనే..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఒడిశా రైలు ప్రమాదం అనేక మంది కుటుంబాల్లో తీరని వ్యథని మిగిల్చింది. సంఘటనా స్థలంలో ఎవరిని కదిలించినా తమ వారిని తలుచుకుని గుండెలు పగిలేలా రోదిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మృతదేహాలు ఒక్కోచోట పదులు సంఖ్యలో కనిపిస్తున్నాయి. అయితే ఒడిశాలోని బాలేశ్వర్ ప్రాంతానికి చెందిన రమేష్ అనే యువకుడు తన తల్లి పెద్ద కర్మ లో పాల్గొనేందుకు చెన్నై నుంచి ఇటీవల బాలేశ్వర్ వచ్చాడు. తిరిగి చెన్నై వెళ్తుండగా కోరమాండల్ ట్రైన్ యాక్సిడెంట్ లో మృతి చెందాడు. రమేష్ మృతి చెందిన విషయం తెలుసుకుని ఆయన సోదరుడు సురేష్ రోధిస్తూ మీడియాతో మాట్లాడారు.

అన్నయ రమేష్ 14 ఏళ్ల తర్వాత చెన్నై నుంచి తల్లి పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాడు. రమేష్ చెన్నైలోనే 14 ఏళ్లుగా స్థిరపడ్డాడు. శుక్రవారం స్వయంగా తానే వచ్చి రమేష్ ను వచ్చి రైల్వే స్టేషన్ లో వదిలి వెళ్లాను. రాత్రి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం వార్త తెలియగానే ఆందోళనతో అన్న రమేష్ కు ఫోన్ చేశాను. అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కాసేపటికి వేరే వ్యక్తి ఫోన్ ఎత్తి రమేష్ చనిపోయాడని చెప్పాడు. వెంటనే ప్రమాదం జరిగిన చోటకు వచ్చాను. అధికారులు మృతదేహాలను బాలేశ్వర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అక్కడ అన్న మృతదేహాం చూసి సురేష్ బోరున విలపించాడు.

Advertisement

Next Story

Most Viewed