- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిరిజన బ్యాక్‌గ్రౌండ్ నేతను సీఎంగా ఎన్నుకున్న బీజేపీ
దిశ, నేషనల్ బ్యూరో: బుధవారం ఒడిశాలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దశబ్దాలుగా అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్‌ను ఓడించి కాషాయా పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. మొత్తం 147 స్థానాలున్న ఒడిశా అసెంబ్లీలో జూన్ 4న బీజేపీ 78 సీట్లను సాధించింది. రాష్ట్రంలోని 21 లోక్‌సభ స్థానాలకు గానూ 20 స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో 52 ఏళ్ళ మోహన్ చరణ్ మాఝీని ఒడిశా కొత్త సీఎంగా ఎంపిక చేశారు. ఆయన కియోంజర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గిరిజన సామాజిక వర్గానికి చెందిన మాఝీ బీజేపీ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే ఒడిశా ఉప ముఖ్యమంత్రులుగా కేవీ సింగ్ డియో, ప్రవతి పరిదాను ఎంపిక చేశారు. బుధవారం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. దీనికి ప్రధాని మోడీ హాజరుకానున్నారు. మంగళవారం రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కాగా దీనికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్‌లను హాజరయ్యారు. ఈ సమావేశంలో మోహన్ చరణ్ మాఝీని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. జూన్ 10న ఒడిశాలో కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం ఉంటుందని మొదటగా పేర్కొన్నప్పటికీ దాన్ని జూన్ 12కు వాయిదా వేశారు.