Odisha:కొవిడ్ టైంలో ఒడిశాలో భారీ అక్రమాలు.. కాగ్ ఆడిట్‌లో వెల్లడి

by vinod kumar |
Odisha:కొవిడ్ టైంలో ఒడిశాలో భారీ అక్రమాలు.. కాగ్ ఆడిట్‌లో వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో: కరోనా సమయంలో ఒడిశా(Odisha)లోని ఆస్పత్రులకు చేసిన చెల్లింపులకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కొవిడ్ (Covid) టైంలో రాష్ట్రంలో కరోనా చికిత్స కోసం ప్రయివేట్ కొవిడ్ కేర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆస్పత్రులకు చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) గుర్తించింది. రాష్ట్ర అసెంబ్లీలో శనివారం సమర్పించిన నివేదికలో ఈ వివరాలు పొందుపర్చింది. ప్రయివేట్ ఆస్పత్రులను నిర్వహించే డీసీహెచ్‌ల నిర్వహణకు ఒడిశా ప్రభుత్వం ఏప్రిల్ 2020లో మార్గదర్శకాలను జారీ చేసిందని కాగ్ పేర్కొంది. 51,967 మంది కొవిడ్ పేషెంట్లు వీటితలో చికిత్స పొందగా వారి కోసం రూ.724.50 కోట్లు ఖర్చు చేశారు. అయితే పత్రాల పరిశీలన, ధ్రువీకరణ లేకుండానే చెల్లింపు బిల్లును ఆమోదించినట్లు ఆడిట్‌లో తేలిందని కాగ్ తెలిపింది. అంతేగాక ప్రాథమిక పత్రాల పరిశీలన లేకుండానే డీసీహెచ్‌కు రూ.144.88 కోట్లు చెల్లించినట్టు గుర్తించింది. అలాగే ఖుర్దా, కటక్ జిల్లాల్లోని 10 ప్రయివేట్ డీసీహెచ్‌లకు పీపీఈ కిట్‌ల సరఫరాలో రూ.2.73 కోట్ల అక్రమాలు జరిగినట్టు తెలిపింది. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హామీ ఇచ్చింది.

Next Story

Most Viewed