- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ, బీజేడీకి లగ్గం..వెడ్డింగ్ కార్డులు పంచి కాంగ్రెస్ వేడుకలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశాలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అక్కడి రాజకీయాలు హట్ టాపిక్‌గా మారాయి. బీజేపీ, కాంగ్రెస్, బీజేడీ (బిజూ జనతాదళ్) పార్టీలు ఆ రాష్ట్ర ప్రధాన పార్టీలు. ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఒడిశా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తనదైన శైలిలో వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీకి, బీజేడీ (బీజూ జనతాదళ్)కు పెళ్లి అంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వెడ్డింగ్ కార్డు ముద్రించింది. ఈ వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరినీ ఆహ్వానించింది. దీంతో వెడ్డింగ్ కార్డు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇది ఆ స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్‌గా మారింది. జనవరి 25న ఉదయం 11.33 గంటలకు పెళ్లి డేట్ ఫిక్స్ చేసింది. ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు యాషిర్ నవాజ్ బీజేడీ, బీజేపీ 'వివాహ వేడుక'కి ప్రతి ఒక్కరినీ ఆహ్వానించారు. అన్నట్లుగానే భువనేశ్వర్‌లోని మాస్టర్ క్యాంటీన్ స్క్వేర్‌లో పెళ్లి సెట్ వేసి‘వివాహ వేడుక’నిర్వహించారు. కాగా, బీజేపీ, బీజేడీ మధ్య రహస్య పొత్తు ఉందని చెప్పాడానికి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. గతంలో 2004 ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో బిజు జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ బీజేపీతో పొత్తు పెట్టుకుని మెజారిటీ స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే.