ఓట్ల కోసం లేని సమస్యను ఉన్నట్టు ప్రచారం చేయడం బీజేపీకి అలవాటే: ఒడిశా సీఎం

by S Gopi |
ఓట్ల కోసం లేని సమస్యను ఉన్నట్టు ప్రచారం చేయడం బీజేపీకి అలవాటే: ఒడిశా సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతుండగా తన ఎడమచేయి వణకడం వీడియోలో రికార్డు అయింది. దీనిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ విమర్శలు చేశారు. దీనికి బదులిచ్చిన నవీన్ పట్నాయక్.. 'లేని సమస్యను ఉన్నట్టుగా సృష్టించడం బీజేపీకి అలవాటే. తన చేయి గురించి వారు కొత్తగా చర్చ మొదలుపెట్టారు. బీజేపీ పార్టీ ఓట్ల కోసం ఇలాంటి ప్రచారం చేయడం సహజమే. అయినా ఇలాంటి పనుల వల్ల ప్రజలు ఓట్లు వేయరని వారు గుర్తించుకోవాలి' అంటూ స్పందించారు. కాగా, అంతకుముందు హేమంత బిశ్వశర్మ్ ఎక్స్‌లో వీడియోను పోస్ట్ చేస్తూ.. మాజీ ప్రభుత్వోద్యోగి వీకే పాండియన్ నవీన్ పట్నాయక్‌ను బందీగా ఉంచారని, ఆయన కదలికలను కూడా అతను నియంత్రిస్తున్నాడని ఆరోపణలు చేశరు. రాష్ట్ర భవిష్యత్తుపై తమకు ఆందోళన ఉందని, ఇది చాలా బాధ కలిగించే వీడియో. నవీన్ బాబు చేతిని పాండియన్ నియంత్రిస్తున్నారు. తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి ఒడిశా భవిష్యత్తుపై నియంత్రణ చూస్తుంటే భయమెస్తోందని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story