NSA Ajit Doval: మయన్మార్ ప్రధానితో అజిత్ థోవల్ భేటీ..సరిహద్దులో శాంతి, సుస్థిరతపై డిస్కషన్

by vinod kumar |
NSA Ajit Doval: మయన్మార్ ప్రధానితో అజిత్ థోవల్ భేటీ..సరిహద్దులో శాంతి, సుస్థిరతపై డిస్కషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిమ్ స్టెక్) భద్రతా చీఫ్‌ల 4వ వార్షిక సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించేందుకు జాతీయ భద్రతా సలహాదాలు దోవల్ మయన్మార్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన శనివారం మయన్మార్ ప్రధాన మంత్రి సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్‌తో భేటీ అయ్యారు. సరిహద్దు ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను నెలకొల్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, సహకారం, మయన్మార్ రాజకీయ పురోగతి, స్వేచ్ఛాయుతమైన బహుళపక్ష ప్రజాస్వామిక సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు వంటి అంశాలపై స్నేహపూర్వకంగా అభిప్రాయాలు పంచుకున్నట్టు సమాచారం. ఈ మేరక మయన్మార్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓ పత్రిక కథనాన్ని వెల్లడించింది. భారత సరిహద్దు ప్రాంతంలో శాంతి, సుస్థిరతను నెలకొల్పేందుకు మయన్మార్ కృషి చేస్తుందని పేర్కొంది. కాగా, భారత్, మయన్మార్ లు 1643కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి.



Next Story

Most Viewed