ప్రధాని మోదీ శ్రీనగర్‌ ప్రసంగంలో కొత్తదనమేమీ లేదు: ఒమర్ అబ్దుల్లా

by S Gopi |
ప్రధాని మోదీ శ్రీనగర్‌ ప్రసంగంలో కొత్తదనమేమీ లేదు: ఒమర్ అబ్దుల్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం శ్రీనగర్ ర్యాలీలో చేసిన ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని, జమ్మూ కశ్మీర్ ప్రజల ఆశలు అడియాసలయ్యాయని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. 'నాకు మోడీ ప్రసంగంలో కొత్తేమీ కనిపించలేదు. అవే పాత విషయాల గురించి మాట్లాడారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ గురించి, ప్రజలు వినాలనుకుంటున్న దేని గురించీ ఆయన ప్రస్తావించలేదు ' అని అబ్దుల్లా శుక్రవారం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో అన్నారు. ప్రధానమంత్రి స్వయంగా ఎన్నికలను ప్రకటించలేనప్పటికీ, సుప్రీంకోర్టు సెప్టెంబర్ 31 గడువు కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడం గురించి మోడీ కనీసం చెప్పాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇంకా, పూర్తిస్థాయిలో రాష్ట్ర హోదా గురించి, నిరుద్యోగ యువతకు ఉపాధి ప్యాకేజీ, విద్యుత్ సంక్షోభం, దినసరి వేతన కార్మికుల రెగ్యులైజేషన్ గురించి ఏదో ఒకటి చెప్పి ఉండాల్సిందని అబ్దుల్లా వెల్లడించారు. మోడీ వీటన్నిటీ గురించి మాట్లాడతారని ఆశించామని, కానీ అలా జరగలేదని పేర్కొన్నారు.

Advertisement

Next Story