- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎఫ్-35 అంటే ఫ్రిజ్ కాదు.. వెంటనే కొనడానికి

- ఇండియా లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
- 5వ జనరేషన్ ప్రోగ్రామ్‌ను వేగవంతం చేయాలి
- ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్
దిశ, నేషనల్ బ్యూరో: భారత వైమానిక దళం సాధ్యమైనంత త్వరగా అత్యంత అధునాతన సాంకేతికను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. భారత్ తన 5వ జనరేషన్ యుద్ద విమానాల తయారీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ అన్నారు. ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను ఇండియాకు అమ్ముతామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పిన కొన్ని రోజులకే ఏపీ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇండియా టుడే కాంక్లేవ్ 2025లో మాట్లాడుతూ ఎఫ్-35లపై ఇంకా సమీక్ష జరగలేదు. దీనికి సంబంధించిన ధరను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒక్కో ఎఫ్-35 80 మిలియన్ డాలర్లు (సుమారు రూ.690 కోట్లు) వ్యయం అవుతుంది. ఇది ప్రస్తుత మార్కెట్‌లో ఉన్న అత్యంత ఖరీదైన విమానం. పైగా ఎఫ్-35 పని తీరుపై కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయని ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు.
ఎఫ్-35ల గురించి పూర్తిగా విశ్లేషణ చేయలి. మన అవసరాలు ఏంటి.. ఎఫ్-35లో ఉండే ఆప్షన్లు ఏంటనేవి బేరీజు వేసుకోవాలి. ధర కూడా ఇందులో భాగమే. ఇదేమీ ఇంట్లోకి కొనుక్కునే వాషింగ్ మెషినో, ఫ్రిజ్జో కాదు కదా.. చూడటానికి బాగుందని కొనుక్కోవడానికి అని ఏపీ సింగ్ అన్నారు. ఇంత వరకు అమెరికా అధికారికంగా ఎఫ్-35లను అమ్ముతామని చెప్పలేదు. మనం కూడా ఇంకా ఈ విషయంలో ఆలోచన ఏదీ చేయడం లేదని ఏపీ సింగ్ చెప్పారు. భారత్ తన తక్షణ అవసరాల కోసం మార్కెట్లో దొరికే వాటిని వెంటనే కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చైనా 6వ జనరేషన్ యుద్ద విమానాలను విజయవంతంగా పరీక్షించింది. కానీ మనం మాత్రం ఇంకా 5వ జనరేషన్ యుద్ద విమానాన్ని డెవలప్ చేసే స్థాయిలోనే ఉన్నాం. మన 5వ జనరేషన్ విమానం 2035లో కానీ అందుబాటులోకి రాదని ఏపీ సింగ్ చెప్పారు.
భారత వాయుసేనకు 42 ఫైటర్ స్క్వార్డన్‌ల అనుమతి ఉంది. కానీ ప్రస్తుతం మన దగ్గర 30 స్క్వార్డన్ల విమానాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కో స్క్వార్డన్‌లో 18 యుద్ద విమానాలు ఉంటాయి. ఒక వైపు చైనా 6వ జనరేషన్ యుద్ద విమానాన్ని తయారు చేసుకుంది. ఇక పాకిస్తాన్ వద్ద ఎఫ్-16 ఫ్లీట్ ఉన్నాయి. ఇటీవలే వీటి మెయింటెనెన్స్ కోసం పాకిస్తాన్‌కు అమెరికా నిధులు కూడా ఇచ్చింది. ఇలాంటి సమయంలో భారత్ వాయుసేన బలహీనంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అధునాతన సాంకేతికత కలిగిన యుద్ద విమానాలను సమకూర్చుకోవల్సిన అవసరం ఉందని ఏపీ సింగ్ చెప్పారు.
Read More ....
Army chief: చైనా- పాక్ సంబంధాలపై ఆర్మీ చీఫ్ ఏమన్నారంటే?