ఆ ఏడాది తర్వాత.. విదేశీ పప్పులు అక్కర్లేదు : అమిత్‌షా

by Hajipasha |
ఆ ఏడాది తర్వాత.. విదేశీ పప్పులు అక్కర్లేదు : అమిత్‌షా
X

దిశ, నేషనల్ బ్యూరో : 2027 నాటికి పప్పు దినుసుల సాగులో భారత్ స్వావలంబన సాధిస్తుందని, 2028 జనవరి నుంచి కిలో పప్పులు కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరముండదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పెసర్లు, శెనగల సాగులో దేశం ఇప్పటికే స్వయం సమృద్ధిని సాధించిందని చెప్పారు. కేంద్ర్ర సహకార శాఖ మంత్రి కూడా అయిన షా.. పప్పుధాన్యాల సేకరణ సేవలకు సంబంధించిన పోర్టల్‌ను గురువారం ఆవిష్కరించారు. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీసీఎఫ్) పోర్టళ్లలో నమోదు చేసుకున్న 25 మంది పప్పు రైతులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా రూ.68 లక్షలను పోర్టల్ ద్వారా ఆయన బదిలీ చేశారు. విత్తనాలు విత్తడానికి ముందే పప్పు రైతులు తమ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు విక్రయించడానికి నాఫెడ్, ఎన్సీసీఎఫ్‌ పోర్టల్‌‌లలో నమోదు చేసుకోవచ్చని షా చెప్పారు. మినప పప్పు, మసూర్ పప్పు, మొక్కజొన్న రైతులకు కూడా భవిష్యత్తులో ఇలాంటి సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మార్కెట్లో పప్పుల రేట్లు కనీస మద్దతు ధర కంటే తగ్గిపోయినప్పుడు .. నాఫెడ్, ఎన్సీసీఎఫ్‌ల ద్వారా మద్దతు ధర పథకం కింద కొనుగోలు చేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed