- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ వ్యాఖ్యలు నవ్వు తెప్పించాయి.. రాహుల్ గాంధీ
డెహ్రాడూన్: పార్లమెంట్ లో ప్రధాని మోడీ వ్యాఖ్యలు విన్న తర్వాత భయం కాకుండానవ్వొచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ నెల 14న ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని మంగ్లౌర్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రులంతా అవినితీ పరులేనని ఆయన అన్నారు. రాష్ట్రానికి రైతులు, యువత, పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం కావాలని నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పార్లమెంట్ స్పీచ్ పై స్పందిస్తూ.. ఆయన తన సమయాన్ని మొత్తం కాంగ్రెస్ కోసమే కేటాయించారని అన్నారు. కానీ చైనా విషయంలో సందేహాలపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదని అన్నారు. రాహుల్ వినిపించుకోరన్న మోడీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కేంద్ర దర్యాప్తు సంస్థలు తనపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేవని అన్నారు. జీఎస్టీతో చిన్న, మధ్య తరహా వ్యాపారులు, రైతులు, ఉద్యోగులకు నష్టం కలిగిందని చెప్పారు. ప్రధాని మోడీ తన సుధీర్ఘ ప్రసంగంతో కాంగ్రెస్‌తో పాటు తనపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకు 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. రైతులకు, వ్యాపారులకు ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు.