అథ్లెట్ల పోరాటం కాదు.. రాజకీయ పార్టీల పోరాటం: డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్

by Mahesh |
అథ్లెట్ల పోరాటం కాదు.. రాజకీయ పార్టీల పోరాటం: డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ వ్యతిరేఖంగా భారత రేజర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొద్ది రోజులుగా నిరసన చేస్తున్నారు. ఈ క్రమంలో తమకు రాజకీయ పార్టీల మద్దతు కావాలిన రెజ్లర్లు కోరడంతో వరుసగా అన్ని పార్టీల కీలక నాయకులు రెజ్లర్లకు మద్దతుగా నిరసన తెలిపి రెజ్లర్లకు మద్దతుగా నిలుస్తున్నారు.

ఈ క్రమంలో రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. రెజ్లర్లు తనపై నిరసన వ్యక్తం చేయడం అథ్లెట్ల పోరాటం కాదని, రాజకీయ పార్టీల పోరాటం అని అన్నారు. "హర్యానాకు చెందిన 90% మంది రెజ్లర్లకు నాతో ఎలాంటి సమస్యలు లేవు, ఇది కేవలం ఒక కుటుంబం మాత్రమే అన్ని సమస్యలను సృష్టిస్తోంది" అని సింగ్ తెలిపారు. అలాగే జంతర్‌మంతర్‌లో కూర్చోవడం వల్ల న్యాయం జరగదని ఆయన అన్నారు.

Advertisement

Next Story