వాళ్ల ఆర్థిక పరిస్థితి మీకు తెలుసా...?

by S Gopi |
వాళ్ల ఆర్థిక పరిస్థితి మీకు తెలుసా...?
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ జిల్లా నేతల సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ప్రతిపక్షాలు పదే పదే భారత దేశ అభివృద్ధి కుంటుపడిందని అంటున్నారని, అసలు కోవిడ్ తర్వాత యూఎస్, యూరప్, చైనా మరియు ఆస్ట్రేలియా ఆర్థిక పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియదన్నారు. మహమ్మారి సమయంలో ఇతర దేశాలు సరైన నిర్ణయాలు తీసుకోలకపోవడంతో వల్ల వారి ఆర్థిక పరిస్థితి కుంటుపడిందన్నారు. అదేవిధంగా ఉగ్రెయిన్ సంక్షోభం కారణంగా మహమ్మారి మరియు సరఫరా గొలుసు సమస్యల తర్వాత కూడా ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నదిని అన్నారు.

Advertisement

Next Story