Shiv Sena: గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితులకు పార్టీ పదవి లేదు: షిండే

by S Gopi |
Shiv Sena: గౌరీ లంకేష్ హత్య కేసులో నిందితులకు పార్టీ పదవి లేదు: షిండే
X

దిశ, నేషనల్ బ్యూరో: జర్నలిస్టు-కార్యకర్త గౌరీ లంకేష్ హత్యతో పాటు నలసోపరా ఆయుధ-మందుగుండు సామగ్రి కేసులో నిందితుడైన శ్రీకాంత్ పంగార్కర్‌ను శివసేనలో చేర్చుకోవడంపై విమర్శల నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆదివారం రాజకీయ చర్చకు తెరలేపారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అంతకుముందు శుక్రవారం నాడు జల్నాలో శివసేన సీనియర్ నేత, మాజీ మంత్రి అర్జున్ ఖోట్కర్ పంగార్కర్‌ను పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు కేసుల్లో పంగార్కర్ బెయిల్‌పై ఉన్నారు. నిజానికి, ఒకప్పటి శివసేన 2001-06 మధ్య కాలంలో పంగార్కర్ జల్నా మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్నారు. పంగార్కర్ మాజీ శివసైనికుడు, పార్టీలోకి తిరిగి వచ్చారు. జల్నా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆయనను చీఫ్‌గా ప్రతిపాదించారుని ఖోట్కర్ విలేకరులతో చెప్పారు. ఎన్నికల కోసం 99 మంది అభ్యర్థులతో కూడిన బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. అయితే, విమర్శలు తీవ్రం కావడంతో, పంగార్కర్‌కు ఇచ్చిన ఎలాంటి పదవినైనా రద్దు చేయాలని షిండే ఆదేశించినట్లు శివసేన కార్యదర్శి భౌసాహెబ్ చౌదరి తెలిపారు. అయితే పంగార్కర్ శివసేనలో కొనసాగుతారా లేదా అన్నది మాత్రం సీఎం స్పష్టం చేయలేదు. కాగా, 2017,సెప్టెంబర్ 5న బెంగళూరులోని తన నివాసంలో జర్నలిస్ట్ గౌరీ లంకేష్‌ను కాల్చి చంపిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed