- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బెంగాల్ ఎన్నికలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
కోల్‌కతా: కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 35 స్థానాలు గెలిపిస్తే రామ నవమి వేడుకలు శాంతియుతంగా జరిగేలా చూస్తామని అన్నారు. బెంగాల్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన బిర్భూంలో మాట్లాడారు. మమతా బుజ్జగింపుల వల్లే ఈ అల్లర్లు జరుగుతన్నాయని విమర్శించారు. ఒక్కసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఏ ఒక్కరూ కూడా రామనవమి వేడుకల్లో దాడులు చేసే ధైర్యాన్ని కలిగి ఉండరని అన్నారు. మమతా, అభిషేక్ నేరాలపై పోరాడాలంటే ఉన్న ఏకైక మార్గం బీజేపీనేనని చెప్పారు. రాష్ట్రంలో చొరబాటును ఆపాలంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని 35 స్థానాల్లో గెలిపించాలని కోరారు. తన అల్లుడిని ముఖ్యమంత్రి చేయడంపైనే దీదీ ఆసక్తి ఉందని దుయ్యబట్టారు. అయితే రాబోయే సీఎం బీజేపీ నుంచే వస్తారని, దానికి 2024 ఎన్నికలే ట్రైలర్ అని చెప్పారు.