Nayab Saini : నేనొక సీఎంను.. పోటీ ఎక్కడి నుంచో నాకే తెలియదు : నయాబ్ సింగ్ సైనీ

by Hajipasha |
Nayab Saini : నేనొక సీఎంను.. పోటీ ఎక్కడి నుంచో నాకే తెలియదు : నయాబ్ సింగ్ సైనీ
X

దిశ, నేషనల్ బ్యూరో : త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హర్యానాలో రాజకీయ సందడి నెలకొంది. అన్ని పార్టీలు ఇప్పుడు అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. అధికార బీజేపీకి చెందిన అభ్యర్థుల ఎంపికపైనా ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో కొందరు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టెన్షన్‌కు లోనవుతున్నారు. తమను పక్కనపెట్టి, కొత్తవారికి అవకాశం ఇస్తారేమోనని పలువురు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రోజు హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘పార్టీలో ఎవరికి ఏ అసెంబ్లీ స్థానం కేటాయించాలనే దానిపై తుది నిర్ణయాన్ని బీజేపీ పార్లమెంటరీ బోర్డు తీసుకుంటుంది. నేనొక సీఎంను. కర్నాల్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఈసారి కూడా అదే స్థానం నుంచి నాకు అవకాశం దొరుకుతుందని కచ్చితంగా చెప్పలేను. ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది నేను నిర్ణయించుకోలేను. మా పార్టీలోని ఏ నేత కూడా అసెంబ్లీ సీటు విషయంలో కచ్చితమైన క్లారిటీ ఇవ్వలేరు’’ అని ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed