- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Congress: ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలకు కేంద్రం నుంచి న్యాయం జరగడం లేదు: డీకే శివకుమార్
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర బడ్జెట్‌లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు జరిగిన అన్యాయంపై పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం నుంచి న్యాయం జరగని కారణంగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. 'కేంద్రం వద్ద సరైన విధానం లేదు. న్యాయం లభించడంలేదు. అందుకే కాంగ్రెస్ నేతలు అందరూ బడ్జెట్‌లో సరైన ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే నేత, కాంగ్రెస్ మిత్రపక్షం ఎంకే స్టాలిన్ సైతం నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకావడంలేదని అన్నారు. బడ్జెట్‌లో బీజేపీ ప్రభుత్వం పక్షపాతంతో కూడుకున్నదని వెల్లడించారు. కేంద్ర బడ్జెట్-2024లో వివక్షను దృష్టిలో ఉంచుకుని జూలై 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని తమ పార్టీ ముఖ్యమంత్రులు బహిష్కరిస్తారని అంతకుముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కే సి వేణుగోపాల్ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్రం అనుసరించాల్సిన సమాఖ్య విధానానికి, న్యాయమైన విధానాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.