- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధానమంత్రి పదవిపై ఆశ లేదు: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: నేనెప్పుడూ ప్రధాని రేసులో లేనని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఉన్న దానితోనే సంతృప్తి చెందుతానని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. నేను రాజకీయ నాయకుడి కాదని, నిబద్దతతో కూడిన బీజేపీ కార్యకర్తను మాత్రమేనని చెప్పారు. ‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్‌ని నమ్ముతాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో ఎన్డీయే ప్రభుత్వం ప్రశంసనీయమైన పని చేస్తోంది. మోడీ నాయకత్వంలో మళ్లీ మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకం ఉంది’ అని వ్యాఖ్యానించారు. రామమందిర అంశంపై స్పందిస్తూ..రామ మందిరం అంశాన్ని రాజకీయం చేయకూడదని, ఎందుకంటే ఇది విశ్వాసానికి సంబంధించిన అంశమని చెప్పారు. మెజారిటీ ప్రజలు తమ కల నెరవేరినందుకు సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. గత పదేళ్లలో బీజేపీ చేసింది..60ఏళ్లలో కాంగ్రెస్ చేయలేక పోయిందని విమర్శించారు. మోడీపై ప్రజలకు నమ్మకం ఉంది..తప్పనిసరిగా ఎన్డీయేకు మెజారిటీ ఇస్తారు అని దీమా వ్యక్తం చేశారు.