మోడీ తిరిగి అధికారంలోకి రావడంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

by S Gopi |
మోడీ తిరిగి అధికారంలోకి రావడంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి అధికారంలోకి రావడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా గట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం బీజేపీ జాతీయ సదస్సులో ప్రసంగించిన అమిత్ షా, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రధాని మోడీ మళ్లీ అధికారాన్ని పొందే విషయమై ప్రజలు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బీజేపీలో కుటుంబ రాజకీయాలు ఉంటే, టీ అమ్మే వ్యక్తి కొడుకు దేశానికి ప్రధాని అయ్యేవాడు కాదన్నారు. మోడీ ప్రభుత్వ హయాంలోని 10 ఏళ్లలో అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. మోడీ విదేశాంగ విధానాన్ని మెచ్చుకున్న షా, 'గతంలో ప్రపంచవ్యాప్తంగా స్నేహితులను సంపాదించుకోవడానికి జాతీయ భద్రత విషయంలో రాజీ పడాలనే అపోహ ఉండేది. మోడీ ఈ విషయంలో భారత్‌ను 'విశ్వామిత్ర 'గా మార్చేందుకు కృషి చేశారు. ప్రతి ఒక్కరిలో 'వసుధైక కుటుంబం' అనే భావనను కలిగించారు. ప్రతి ఒక్కరూ ప్రపంచమే ఒక పెద్ద కుటుంబమని భావించేలా' చేశారన్నారు. 2047లో భారత స్వాతంత్ర్యానికి 100 ఏళ్లు పూర్తవనున్నాయి. 2047లో భారత ప్రధాని మోడీ విజన్‌ను ప్రచారం చేసేందుకు బీజేపీ నేతలు జాతీయ సదస్సు తర్వాత అన్ని నియోజగకవర్గాలకు యాత్ర చేస్తారని షా ప్రకటించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా విరుచుకుపడ్డారు. 'కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రజాస్వామ్య స్పూర్తిని నాశనం చేస్తోంది. దేశ ప్రజాస్వామ్యానికి అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులు, కులతత్వంతో రంగులు పులుముతున్నారు. ప్రజాభిప్రాయం ఎప్పటికీ స్వతంత్రంగా ఉండేందుకు అడ్డుపడుతున్నారని' షా విమర్శలు చేశారు.

Advertisement

Next Story