యూపీలో ఆ పార్టీకే ‘ఆప్’ మద్దతు

by Hajipasha |
యూపీలో ఆ పార్టీకే ‘ఆప్’ మద్దతు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో పోటీ చేస్తున్న ఇండియా కూటమి అభ్యర్థులకు బేషరతుగా మద్దతును ప్రకటించింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, నిరంకుశ ప్రభుత్వాన్ని అంతం చేయడానికి ఈనిర్ణయం తీసుకున్నామని ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులకు పూర్తి మద్దతును అందిస్తామని తెలిపారు. ఇండియా కూటమి ఉమ్మడి ప్రచారంలో ఆప్ క్యాడర్ ఏ విధంగా భాగస్వామ్యం కావాలనేది .. కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో చర్చించాక వెల్లడిస్తామన్నారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈవివరాలను సంజయ్ సింగ్ చెప్పారు. సమాజ్ వాదీ, ఇండియా కూటమి అభ్యర్థులు పోటీలో ఉన్న చోట ఆప్ పూర్తి సహకారాన్ని అందిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏకంగా కేజ్రీవాల్ లాంటి సీఎం హోదాలో ఉన్న నేతను జైల్లో పెట్టి.. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్ర సర్కారు కుయుక్తులు పన్నడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

Advertisement

Next Story