- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నితీశ్ కుమార్ కు ప్రధాని పోస్ట్ ఆఫర్.. మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి ముంగిట్లో జేడీయూ నేత హాట్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో:కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ సీట్లు రాకపోవడంతో కూటమి మిత్రపక్షాలతో కలిసి మోడీ కొత్త సర్కార్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ క్రమంలో జేడీయూ ముఖ్య నేత కేసీ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి జేడీయూ చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు ప్రధాని ఆఫర్ వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆజ్ తక్/ఇండియా కూటమికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నితీశ్ కుమార్ ను ఇండియా కూటమికి కన్వీనర్ గా చేయడానికి అనుమతించని వ్యక్తుల నుంచే ప్రధాన మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ వచ్చిందని చెప్పారు. అయితే ప్రస్తుతం తాము ఎన్డీయే కూటమిలో భాగస్వాములుగా ఉన్నందునా ఈ ఆఫర్ ను నితీశ్ తిరస్కరించారని చెప్పారు. కాగా కాగా మొన్నటి లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దేశవ్యాప్తంగా 240 ఎంపీ స్థానాల్లో విజయం సాధించగా బిహార్ లో జేడీయు 12 స్థానాలు, ఏపీలో టీడీపీ 16 దక్కించుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో జేడీయూ, టీడీపీ పాత్ర కీలకంగా మారింది. అయితే బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ లేకి కారణంగా ఇండియా కూటమి నేతలు టీడీపీ, జేడీయూతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో త్యాగి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.