Raksha Bandhan: బాంబాక్స్ ఇంపలాటికా చెట్టుకు రక్షణ దారం కట్టిన బిహార్ సీఎం

by Shamantha N |
Raksha Bandhan: బాంబాక్స్ ఇంపలాటికా చెట్టుకు రక్షణ దారం కట్టిన బిహార్ సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ‘బాంబాక్స్ ఇంపలాటికా చెట్టు’ కు రక్షణ దారాన్ని కట్టారు. పాట్నాలోని రాజధాని ఉద్యానవనంలో ‘దొరండా’ మొక్కను కూడా నాటారు. పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించడం, మొక్కలను సంరక్షించడం, మరిన్ని చెట్లను నాటడమే లక్ష్యమని నితీష్ కుమార్ అన్నారు. పర్యావరణాన్ని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం 2012 నుండి రక్షా బంధన్‌ను 'బిహార్ వృక్ష సురక్షా దివస్'గా పాటిస్తోంది. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని, వాటిని కాపాడాలని, జల్‌ జీవన్‌ హరియాలి మిషన్‌ కింద మొక్కలు నాటడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీఎంవో ప్రకటనలో పేర్కొంది. బిహార్ లో ఎకో టూరిజంను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వెల్లడించింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed