Nitish Kumar: ఫ్లాష్.. ఫ్లాష్.. బీహార్ సీఎం రాజీనామా..

by Hajipasha |   ( Updated:2022-08-09 10:54:24.0  )
Nitish Kumar Resigns as Chief Minister of Bihar
X

దిశ, వెబ్‌డెస్క్: Nitish Kumar Resigns as Chief Minister of Bihar| బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు మంగళవారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు రాజ్ భవన్ కు వచ్చి గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంపై ఊహాగానాలు తారాస్థాయికి చేరడంతో ఈరోజు తెల్లవారుజామున జనతాదళ్ ఎమ్మెల్యేలందరితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ తన నిర్ణయానికి మద్దతు తెలిపారు. నితీష్ కుమార్ నిర్ణయానికి తమ మద్దతు కొనసాగుతుందని కూడా వారు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇది వడనా లేక బండరాయా...?

Advertisement

Next Story