- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్డీయేకు 4వేల లోక్‌సభ సీట్లు వస్తాయ్.. సీఎం ప్రకటన
దిశ, నేషనల్ బ్యూరో : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన జోస్యం చెప్పారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి 4వేల సీట్లు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బిహార్‌లోని నవాడాలో జరిగిన ఎన్డీయే కూటమి ఎన్నికల ప్రచార సభలో జేడీయూ చీఫ్, సీఎం నితీశ్ దాదాపు 25 నిమిషాల పాటు ప్రసంగించారు. ప్రసంగం చివర్లో.. అదే వేదికపై కూర్చున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైపునకు ఆయన తిరిగారు. తొలుత ‘నాలుగు లక్షలు’ అని తడబడిన నితీశ్.. ఆ వెంటనే తనను తాను సరిదిద్దుకొని ‘4,000 కంటే ఎక్కువ’ లోక్‌సభ సీట్లు ఎన్డీయేకు వస్తాయని చెప్పారు. ఈసారి ఎన్డీయే కూటమిని 400 సీట్లు సాధిస్తుందని ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెబుతుండగా.. నితీశ్ కుమార్ ఏకంగా 4వేల సీట్లు అని చెప్పడం గమనార్హం.
आज नीतीश जी ने तो 4000 पार का नारा लगा दिया। 🤣 pic.twitter.com/Sef6ACaSxo
— Kanchana Yadav (@Kanchanyadav000) April 7, 2024
వాస్తవానికి మన లోక్‌సభలో 543 సీట్లే ఉన్నాయి. బిహార్ సీఎం పొరపాటున నాలుగు వందల సీట్లు అనబోయి నాలుగు వేల సీట్లుగా పలికారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, సీఎం నితీశ్ ప్రసంగం ముగించుకొని వేదికపై ఉన్న తన సీటు దగ్గరికి వెళ్తుండగా.. ‘‘మీరు ఇంత మంచి ప్రసంగం ఇచ్చారు. నేను చెప్పడానికి ఏమీ మిగల్లేదు’’ అని ప్రధాని మోడీ చెప్పారు. దీంతో ఆనందం వ్యక్తం చేసిన నితీశ్ కుమార్.. చిరునవ్వులు చిందిస్తూ ప్రధాని మోడీ పాదాలను తాకి నమస్కరించారు.