- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నితీశ్, చంద్రబాబులు అసంతృప్తితో ఉన్నారు: శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర కేబినెట్‌లో మంత్రిత్వ శాఖల కేటాయింపు తర్వాత ఎన్డీయే మిత్రపక్ష నేతలు జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) చీఫ్ నితీశ్ కుమార్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులు అసంతృప్తితో ఉన్నారని శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. మంగళవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతృత్వంలోని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ఎక్కువ కాలం నిలిచే పరిస్థితిలో లేదని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వ కేబినెట్ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా లేదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భావిస్తే దానిని ఉపసంహరించుకోవాలన్నారు. పోర్టుపోలియోల కేటాయింపులపై జేడీయూ, టీడీపీ అసంతృప్తితో ఉన్నాయని తెలిపారు.
అంతేగాక మంత్రి పదవులు కేటాయించిన విధానం ఎన్డీయే భాగస్వామ్య పార్టీలందరిలోనూ అసంతృప్తికి దారి తీసిందని విమర్శించారు. వారందరినీ సంతృప్తి పర్చడం మోడీ వల్ల కాదన్నారు. జేడీఎస్ నేత కుమారస్వామికి అత్యంత తిరస్కరించబడిన పోర్ట్ ఫోలియో కట్టబెట్టారని చెప్పారు. మోడీ నేతృత్వంలోకి కేబినెట్‌లో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేకపోవడం సరికాదని, ఇది రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధమని మండిపడ్డారు. దేశంలో హిందువులు, ముస్లింల మధ్య చీలికలు తేవాలని మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముస్లింలు బీజేపీకి ఓటు వేయలేదని మోడీ భావిస్తున్నారని, అందుకే వారికి కేబినెట్‌లో స్థానం ఇవ్వలేదని తెలిపారు.