- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Nitin Gadkari: రూ. 1.44 లక్షల కోట్ల టోల్ ఫీజు వసూలు.. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల(Toll plazas) ద్వారా 2000 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు మొత్తం రూ. 1.44 లక్షల కోట్ల టోల్ ఫీజు(Toll Fee) వసూలు చేసిందని కేంద్ర రవాణా శాఖ మంత్రి(Central Transport Minister) నితిన్ గడ్కరీ(Nitin Gadkari) తెలిపారు. లోక్ సభ(Lok Sabha)లో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫాస్టాగ్(Fastag)తో పాటు ఎలక్ట్రానిక్ టోల్ కనెక్షన్ సిస్టమ్(Electronic Toll Connection System)ను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే టోల్ వసూల్ విషయంలో త్వరలో కొత్త విధానాన్ని తీసుకొస్తామని, టోల్ ప్లాజాల వద్ద గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(GNSS) ఆధారిత టోల్ విధానాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. కాగా ఈ కొత్త విధానం ప్రకారం గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆన్-బోర్డ్ యూనిట్ అమర్చిన వెహికల్స్ టోల్ ప్లాజా మీదుగా వెళ్లినప్పుడు కేవలం ఆ వాహనాలు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ బట్టి టోల్ ఫీజ్ ఆటోమేటిక్(Automatic)గా ఫాస్టాగ్ నుంచి కట్ అవుతుంది. తొలుత ఈ విధానాన్ని సెలెక్టెడ్ హైవేస్(Selected Highways)పై అమలు చేసి, ఆ తర్వాత అన్ని జాతీయ రహదారులపై అమల్లోకి తేనున్నారు.